కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేశాయి. ఈ క్రమంలో నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. వీలైనంత వరకు అన్ని పరీక్షలకు హాజరవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగులు వున్నారు. ఇప్పటికే పలు పరీక్షలకు సంబంధించి తేదీలు కూడా వెలుపడ్డాయి.
ఒకే రోజున మూడు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించనుండటంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 26న టీఎస్‌పీఎస్సీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షను నిర్వహించనున్నారు. అదే రోజున కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
మూడు పరీక్షలు ఒకే రోజున వస్తుండటంతో అభ్యర్థులకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహిస్తుండటంతో మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కేవలం ఒకే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
పదిహేనేండ్ల తర్వాత డీపీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలుపడింది. టీఎస్పీఎస్సీ 53 డీఏఓ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు 1.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మూడు పరీక్షలు ఒకే రోజున నిర్వహిస్తే తాము నష్టపోతామని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.