రాష్ట్రంలో కులగణనపై అఖిల పక్ష సమావేశాన్ని జూన్ 1న నిర్వహించనున్నట్టు బీహార్ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరీ వెల్లడించారు.
కుల గణనను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న బీజేపీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటుందని ఆయన తెలిపారు. మొదట ఈ సమావేశాన్ని ఈనెల 27న నిర్వహించాలని సీఎం నితిశ్ కుమార్ అనుకున్నారు.
ఈ మేరకు అన్ని పార్టీ నేతలకు హింట్ ఇచ్చారు. అయితే ఆ తేదిన సమావేశానికి పలు పార్టీలు విముఖత చూపినట్టు సమాచారం. దీంతో జూన్ 1న సమావేశం నిర్వహించనున్నారు.
‘ కుల గణనపై అన్ని పార్టీల అభిప్రాయాలను ఈ సమావేశంలో సేకరిస్తాము. కుల గణనపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై అన్ని పార్టీలతో చర్చిస్తాము’ అని తెలిపారు.