బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.
దేశ సేవలో 42 ఏండ్లుగా బీజేపీ ప్రయాణం చేస్తోందని ట్వీట్ లో తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతికి, పునర్నిర్మాణానికి బీజేపీ పాటుపడుతోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కోట్ల మంది ప్రజల, రైతుల, అణగారిన వర్గాల ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తోందన్నారు. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో దేశ ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నామని పేర్కొన్నారు.
పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ నేడు ప్రసంగించనున్నట్టు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.