ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్న కోడలిపై మామ ఇటుకతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఆమె తలపై పలుమార్లు కొట్టడంతో కోడలు తీవ్రంగా గాయపడింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.ఆమె చేసిన నేరం ఏమీకాదు.తన భర్త సంపాదనకు అండగా ఉండాలని ఆమె కూడా ఉద్యోగం చేయాలని ప్రయత్నించడమే..!
భర్త ప్రవీణ్ కుమార్ సంపాదనకు అండగా ఉండాలని అతడి భార్య కాజల్ భావించింది. తాను కూడా ఉద్యోగం చేస్తానని భర్తకు చెప్పింది.అయితే మామ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఉద్యోగం చేయాలని కోడలు నిర్ణయించింది.
కాగా, మంగళవారం ఉదయం జాబ్ ఇంటర్వ్యూ కోసం ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో నడుచుకుంటూ కాజల్ వెళ్తున్నది. దీంతో మామ ఆమెను అనుసరించి అడ్డగించాడు. చేతిలో ఉన్న ఇటుక రాయితో కోడలు కాజల్ తలపై మోదాడు.
ఆమె తప్పించుకుని పరుగులుపెట్టగా వెంబడించి మరీ ఇటుకతో ఆమె తలపై పలుమార్లు కొట్టాడు. దీంతో కాజల్ తీవ్రంగా గాయపడింది. స్థానికులు స్పందించి అతడ్ని అడ్డుకున్నారు. గాయపడిన కాజల్‌ను భర్త ప్రవీణ్ కుమార్, సంజయ్ గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ఆమె తలపై 17 కుట్లు పడ్డాయి.
మరోవైపు కాజల్ మామపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తున్న కోడలిపై ఇటుక రాయితో మామ దాడి చేసిన సంఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Delhi man assaults daughter-in-law with brick after row over getting a job, incident caught on camera @ArvindKejriwal @AamAadmiParty @AmitShah @BJP4India @BJPLive @JPNadda #woman #poor #helpless #help #law #action #viral #MustWatch #humanity #HumanRights #India #Indian #ModiGovt pic.twitter.com/zAiaOasy0u
— (NPA) POLITICAL ANALYSIS (@AnalysisNpa) March 16, 2023