సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. హత్యకు గురికావడానికి కొన్ని క్షణాల ముందు సీసీటీవీలో ఆ వీడియో రికార్డు అయినట్టు తెలుస్తోంది.
ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గత నెల 29న సిద్దూ హత్యకు గురయ్యాడు. ఇంటి నుంచి బయలు దేరి కొద్ది దూరం వచ్చాక కొంత మంది వ్యక్తులు సిద్దూకు కనిపించారు.
దీంతో వారి దగ్గర ఆయన జీప్ ఆపారు. వారిలో ఒకకరు సిద్దూతో సెల్పీ దిగారు. ఆ తర్వాత సిద్దూ అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. అయితే సిద్దూ బయలు దేరిన విషయాన్ని హంతకులకు వారే ఇచ్చివుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెల్ఫీ దిగిన వ్యక్తిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హత్యకు సంబంధించి అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది.