కంట్లో కనుమాయ అని అంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి చోరీనే దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. సిగ్నల్ రెడ్ సిగ్నల్ మారి గ్రీన్ వచ్చే లోపు రూ. 40 లక్షల రూపాయలు కొట్టేసారు కేటుగాళ్ళు.
వివరాల్లోకి వెళ్తే..ఢిల్లీకి చెందిన ఓ యువకుడు.. రూ. 40 లక్షల నగదు తీసుకొని బైక్‌పై వెళ్తున్నాడు. అయితే భారీగా నగదు తీసుకొని వెళ్తున్న ఆ యువకుడిని ఓ ముగ్గురు యువకులు అనుసరించారు. ఎర్రకోట వద్ద సిగ్నల్ పడగానే.. బైక్‌ను ఫాలో అయిన ఆ ముగ్గురు క్షణాల్లోనే రూ. 40 లక్షల నగదును కొట్టేశారు.
ఒకరేమో బ్యాగు జిప్‌ను తీయగా, మరో యువకుడు డబ్బును క్షణాల్లో తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ యువకుడు మూడో వ్యక్తికి డబ్బు అందజేయగా, అక్కడ్నుంచి జారుకున్నాడు. అయితే సిగ్నల్ వద్ద ఇతర వాహనదారులు ఉన్నప్పటికీ, ఈ చోరీ ఘటనను గమనించలేదు.
తన గమ్యస్థానానికి చేరుకున్న ద్విచక్ర వాహనదారుడు బ్యాగు తెరిచి చూడగా, నగదు మాయమైంది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎర్రకోట వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలనుపరి శీలించారు.