పార్లమెంట్ లో సస్పెండైన ఎంపీలు గాంధీ విగ్రహం ముందు తందూరీ చికెన్ తిన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో అద్దెకు తీసుకున్న నాయకులు ఎంపీలు ఏం తిన్నారనే విషయంపై మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
వాళ్లంత సిల్లీ సోల్స్ అంటూ పరోక్షంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతరు నిర్వహిస్తున్న బార్ ను ప్రస్తావించారు. మీకు తెలియదా మీ యజమానుల గురించి అందుకే వారి వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకోకండి అంటూ ట్వీట్ చేశారు.
వర్షాకాల సమావేశాల సందర్బంగా ఇటీవల విపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. దీంతో స్పీకర్ నిర్ణయంపై పార్లమెంట్ లో గాంధీ విగ్రహం వద్ద సదరు ఎంపీలు నిరసనలు తెలిపారు.
నిరసన సమయంలో గాంధీ విగ్రహం దగ్గర వారంతా తందూరీ చికెన్ తిన్నారంటూ వార్తలు వచ్చాయి. వాటిని ప్రస్తావిస్తూ.. వారి చర్యను తప్పుపట్టింది. నిరసనలకు వచ్చారా లేదా పిక్నిక్ కు వచ్చారా అంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు.