– మరోసారి ప్రోటోకాల్ పంచాయితీ
– కేసీఆర్ తీరును తప్పుబడుతున్న బీజేపీ
– సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్ మోడీకి పలకరా?
ప్రోటోకాల్ విషయాన్ని మరోసారి హైలెట్ చేస్తోంది బీజేపీ. మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతీసారి కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థి సిన్హాకు స్వాగతం చెప్పడానికి టైమ్ ఉంటుంది గాని.. ప్రధాని వస్తే వెల్ కమ్ చెప్పరా? అని ప్రశ్నిస్తోంది.
కేసీఆర్ నిరాశలో ఉన్నారని అందుకే ప్రధానికి స్వాగతం చెప్పడం లేదని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ వల్ల కేటీఆర్ సీఎం కారనే భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. ప్రధాని వస్తుంటే ప్రోటోకాల్ పాటించాలని తెలయదా? అని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
ఇటు బీజేపీ నేత, నటి కుష్బూ కూడా ప్రోటోకాల్ వివాదంపై స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇగో పర్సన్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గోనడం సంతోషంగా ఉందన్న ఆమె.. రాజకీయపరంగా ఎలాంటి విభేదాలున్నా ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర సీఎంగా ఆయనను రిసీవ్ చేసుకోవడం సంస్కారమని అన్నారు.
Advertisements
తెలంగాణలో 2023లో బీజేపీ కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నారు ఆపార్టీ నేతలు. అందుకే.. జాతీయ కార్యవర్గ సమావేశాలను ఈసారి హైదరాబాద్ లో ప్లాన్ సినట్లు చెబుతున్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అంటున్నారు.