ఏడాదికి కోటిన్నర జీతం ఆఫర్ - Tolivelugu

ఏడాదికి కోటిన్నర జీతం ఆఫర్

, ఏడాదికి కోటిన్నర జీతం ఆఫర్
బెనారస్ హిందూ యూనివర్సిటీ ఐఐటీ విద్యార్ధులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో అంతర్జాతీయ కంపెనీలు భారీ ఆఫర్లు ఇచ్చాయి. అంతర్జాతీయ స్థాయి హోదాకు కోటిన్నర జీతం ఆఫర్ చేశాయి. యూనివర్సిటీ ట్రెయినింగ్ ,ప్లేస్‌ మెంట్ సెల్ ఇంచార్జీ, ప్రొఫెసర్ అనిల్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ…మూడు రోజుల ప్లేస్ మెంట్ డ్రైవ్ లో మొదటి రోజు 33 కంపెనీలు 188 ఆఫర్లు ఇచ్చాయన్నారు. చాలా కంపెనీలు రూ. 10 లక్షల నుంచి రూ.58,21,000 వరకు జీతం ఆఫర్ చేశాయని…అయితే నాలుగు ఇంటర్నేషనల్ పొజిషన్స్‌ కోసం మాత్రం రూ.1.53 కోట్లు(2,14,600 USD)ఆఫర్ చేశాయని చెప్పారు.
ప్లేస్ మెంట్స్ కోసం వచ్చిన కంపెనీల్లో నుటానిక్స్, ఎన్ విడియ, మైక్రోసాప్ట్, శాంసంగ్(బి), శాంసంగ్(ఆర్&డి), జేపీ మోర్గాన్, సేపియంట్,ఫిడెలిటి, ఆప్టమ్, మోర్గాన్ స్టాన్లీ, హిందూస్తాన్ యునీలివర్ తో పాటు 41 కంపెనీలు పాల్గొన్నాయి.

Share on facebook
Share on twitter
Share on whatsapp