ఉద్యోగాల భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖాళీ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఘంటా చక్రపాణి చైర్మన్ గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. సభ్యులను కూడా నియమించింది ప్రభుత్వం. కానీ గత డిసెంబర్ లో ఘంటా చక్రపాణి రిటైర్ కాగా, నాటి నుండి తాత్కాలిక చైర్మన్ పాలనలో నడుస్తుంది.
ఒక్కో సభ్యుడు రిటైర్ అవుతూ రాగా… తాత్కాలిక చైర్మన్ గా ఉన్న కృష్ణారెడ్డి కూడా రిటైర్ అయ్యారు. దీంతో కమిషన్ సభ్యుల్లో మిగిలిన ఒకే ఒక్క సభ్యుడు సి.హెచ్ సాయిలును తాత్కాలిక చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా… ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
ప్రభుత్వం త్వరలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటనలు చేసింది. కమిషన్ నుండి భర్తీ చేసే ఉద్యోగాల్లో కనీసం కోరం అయినా ఉండాలి. కానీ ఇప్పుడు ఒకే ఒక్కరు ఉండటంతో… కొత్త సభ్యుల నియామకం జరిగితే తప్పా టీఎస్పీఎస్సీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేలా లేవు.
మరోవైపు ఓ మాజీ ఐపీఎస్ చైర్మన్ గా కొత్త టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం జరుగనుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.