ప్రధాని మోడీ, ప్రముఖ వ్యాపారవేత్త అదానీలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. శ్రీలంక విదేశాంగ మంత్రి ఎంయూఎం అలీ సబ్రీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. మరోసారి ప్రధాని, అదానీల స్నేహ బంధంలో మరో కొత్త పథకం బయటపడిందని సెటైర్లు వేశారు.
అదీ ప్రాజెక్ట్ ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వ రకమైన ఒప్పందం అని శ్రీలంక ప్రభుత్వం చెప్పింది. ఇక ఈ ప్రాజెక్ట్ ను అదానీకి అప్పగించాలని ప్రధాని మోడీ తమను బలవంతం చేశారని శ్రీలంక ప్రభుత్వం గతంలో పేర్కొంది. “ఒక దేశం..ఒక స్నేహితుడు అనే అదానీ, ప్రధాని స్నేహబంధంలో ఇదో కొత్త పథకం” అంటూ కేటీఆర్ ఆరోపించారు.
కాగా, శ్రీలంక రాజధాని కొలంబోలో అదానీ ప్రాజెక్టులను ప్రభుత్వానికి ప్రభుత్వం రకమైన ఒప్పందంగా చూస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఎంయూఎం అలీసబ్రీ అన్నారు. ఉత్తర శ్రీలంక పవన విద్యుత్ ప్రాజెక్టుతో సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ ను భారత ప్రభుత్వమే గుర్తించిందని తెలిపారు.