75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన జాతీయగీతాలాపన కార్యక్రమానికి విశేషమైన స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కార్యక్రమంలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు. రాష్ట్రగాన్ వెబ్‌సైట్‌లో ఆగస్టు 15 మధ్యాహ్నం సమయానికి కోటీ 77 లక్షలకు పైగా మంది జనగణమన పాడి తమ వీడియోలను అప్‌లోడ్ చేసి రికార్డు సృష్టించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. 75 లక్షల మందితో జాతీయగీతాలపన చేయించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ భావించింది. కానీ రెట్టింపులక్ష్యాన్ని చేరుకుంది. మునుపెన్నడూ లేని రికార్డు ఇది అని కేంద్రం చెబుతోంది. భారతదేశ ఐక్యతను ఇది ప్రపంచానికి చాటిందని వెల్లడించింది.