కొత్త సంవత్సరం వస్తోంది. కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటాం. అదే సమయంలో ఈ ఏడాది ఏం చేశామనే దాన్ని ఒక సారి గుర్తు చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాకుండా.. సమాజంలో జరిగిన మార్పులు, సాధించిన పురోగతిని తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎక్కువగా అలరించే క్రీడల్లో క్రికెట్ ఒకటి. ఓసారి మన క్రికెటర్ల ప్రదర్శన గురించి చూద్దాం. ఈ ఏదాది ఎక్కువగా టీ20, టెస్టు మ్యాచ్ లే జరిగాయి. కనుక వన్డే మ్యాచ్ లు పరిమితంగానే జరిగాయి. వన్డే మ్యాచ్ లలో మంచి స్కోర్ చేసినవారి వివరాలను గమనిస్తే.. టాప్ 10లో టీం ఇండియా నుంచి ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. మనదేశానికి క్రికెట్ పరంగా ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది. క్రికెట్ దిగ్గజాలకు భారత్ పుట్టినిల్లుగా మారింది. అయినా.. ఈ ఏడాది ర్యాంకులు మనల్ని కాస్త నిరాశకు గురి చేశాయి. టాప్ 10 మంది ఆటగాళ్లలో బంగ్లాదేశ్ నుంచి ముగ్గురు, ఐర్లాండ్ నుంచి ముగ్గురు ఉండటం గమనార్హం
వరుసగా టాప్ 10లో ఉన్న క్రికెటర్లు
– పాల్ స్టెర్లింగ్
ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా ఐర్లాండ్ కి చెందిన పాల్ స్టెర్లింగ్ నిలిచాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 54.23 సగటుతో 705 పరుగులు చేశాడు.
– జన్నెమన్ మలన్
ఈ సంవత్సరమే.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ జన్నెమన్ మలన్ కళ్లు చెదిరే ప్రదర్శన చేసి రెండో స్థానంలో నిలిచాడు. 7 ఇన్నింగ్స్‌ల్లోనే 84.83 సగటుతో 509 పరుగులతో క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు.
– తమీమ్ ఇక్బాల్
తరువాత స్థానంలో బంగ్లాదేశ్ కు చెందిన బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో 38.66 సగటుతో 464 పరుగులు చేశాడు. ఇక్బాల్ ఈ ఏడాది క్రికెట్ కు దూరంగా కూడా ఉన్నాడు.
– హారీ టెక్టార్
మరో ఐర్లాండ్ కు చెందిన మరో క్రికెటర్ హారీ టెక్టార్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు. 14 ఇన్నింగ్స్ ఆడిన హారీ 454 పరుగులు చేశాడు.
– ఆండ్రూ బాల్బిర్నే
ఐదో స్థానం కూడా మరో ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ ఆండ్రూ బాల్బిర్నే కు దక్కింది. అతడు 14 ఇన్నింగ్స్‌కు గాను 421 పరుగులు సాధించి 32.38 సగటుగాతో తరువాత స్థానంలో నిలిచాడు.
– ముష్ఫికర్ రహీమ్
బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీమ్ 9 వన్డేలు ఆడి 407 పరుగులు చేశాడు. తక్కువ మ్యాచ్ ల్లోనే ఎక్కువ పరుగులు చేయడంతో ఆయన సగటు 58.14గా ఉంది.
– బాబర్ అజామ్
తరువాతి స్థానంలో దాయాది పాకిస్థాన్ కెప్టెన్, రన్ మెషీన్ బాబర్ అజామ్ ఉన్నాడు. రన్ మెషీర్.. రెండు సెంచరీలు చేసి.. మొత్తం 405 పరుగులు చేశాడు.
– మహ్మదుల్లా
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా 11 ఇన్నింగ్స్ ఆడి 399 రన్స్ చేశాడు. అతని సగటు 49.87గా ఉంది.
– వానిందు హసరంగ
పదో స్థానంలో శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ నిలిచాడు. ఈఏడాది 14 ఇన్నింగ్స్ ఆడిన వానిందు హసరంగ 27.38 సగటుతో 356 రన్స్ చేశాడు.