మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? అయితే ట్రాఫిక్ రూల్స్ కూడా ఇక నుంచి తెలుసుకోండి.ఎందుకు అనుకుంటున్నారా…మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులుకు పట్టుబడితే మీరు కూడా ట్రాఫిక్ డ్యూటీ చెయ్యాల్సిందే. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తల్ లో చోటుచేసుకుంది.
కడ్తల్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి ఓ వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టగా రెండు గంటలు ట్రాఫిక్ డ్యూటీ చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. శిక్షలో భాగంగా నరసింహులు షాద్ నగర్ చౌరస్తాలో 2 గంటల పాటు ట్రాపిక్ విధులు నిర్వహించాడు. ‘డోంట్ డ్రంక్ ఎండ్ డ్రైవ్’ అనే నినాదంతో కూడిన ప్లకార్డును చేతబట్టి ట్రాఫిక్ డ్యూటీ చేశాడు. అదేవిధంగా 2100 రూపాయలు కోర్టు జరిమానా విధించింది.