తమిళనాడు తిరుచ్చిరాపల్లి లోని ఓ మార్కెట్లో హీలియం ట్యాంక్ లోగల సిలిండర్ పేలిపోగా ఒకరు మరణించారు. 13 ఏళ్ళ బాలుడితో సహా 22 మంది గాయపడ్డారు. మృతుడిని మాట్టు రవిగా గుర్తించారు. ఈ పేలుడు ధాటికి దగ్గరలోని షాపుల అద్దాలు పగిలిపోగా, ఓ టెంపోతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దంతో అక్కడివారంతా భయంతో పరుగులు తీశారు.
#WATCH | Tamil Nadu: A helium tank exploded in a market in Trichy’s Kotai Vasal area yesterday; One dead & several injured. Case registered. pic.twitter.com/wUHvlaM5GQ
— ANI (@ANI) October 3, 2022
బెలూన్లు అమ్ముకునే నార్ సింగ్ అనే వ్యక్తి హీలియంతో కూడిన ట్యాంక్ వద్ద సిగరెట్ అంటించుకోవడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అనేకమంది ఈ పేలుడును తమ మొబైల్స్ లో రికార్డు చేశారు.
మార్కెట్ లోని బట్టల షాపులో గల సీసీటీవీ కెమెరాలు తీసిన ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఒకరి మృతికి కారణమయ్యాడన్న ఆరోపణపై నార్ సింగ్ ని అరెస్టు చేసినట్టు వారు తెలిపారు. .
జనాలతో రద్దీగా ఉన్న మార్కెట్లో ఈ ట్యాంకును ఎందుకు అనుమతించారన్న దానిపై వారు దర్యాప్తు మొదలు పెట్టారు. బెలూన్లలో గాలిని నింపేందుకు హీలియంని వాడుతారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.