కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిస అయితే భార్య తల్లడిల్లిపోతుంది. ప్రేమించిన ప్రియుడు చెడు అలవాట్లకు లోనైతే ప్రియురాలు అయోమయంలో పడుతోంది. ఆ అలవాట్లు నుంచి వారిని దూరం చేయడానికి నానా అవస్థలు పడతారు. కానీ.. విశాఖలో ఓ యువతి తన ప్రేమను గొప్పగా చాటుకుంది. ప్రియుడి కోసం డ్రగ్స్ తీసుకొని వస్తూ పోలీసులుకు పట్టుబడింది.
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ భూతం యువత భవిష్యత్ ని చిదిమేస్తుంది. ఈ మధ్యకాలంలో యువకులు మరీ ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాడు పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్నిక కఠిన చర్యలు తీసుకుంటున్నా కొత్త పుంతలు తొక్కుతూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ చెందిన ఓ యువతి తన లవర్ కోసం మత్తు పదార్ధాలు అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా బుక్కైంది.
హైదరాబాద్ నుంచి వస్తున్న ఆ యువతి దగ్గర డ్రగ్స్ ఉన్నాయనే పక్కా సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందింది. దీంతో ఆమెను కనిపెట్టిన పోలీసులు తన దగ్గర నుంచి టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్, 2ఎండీఏంఏలను స్వాధీనం చేసుకున్నారు.
ఆమె లవర్ విశాఖలో మర్రిపాలెం ఏరియాకు చెందినవాడని పోలీసులు చెప్పారు. వీరిద్దని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వీరిద్దనేనా? వీరి వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అసలే ఈ మధ్య డ్రగ్స్ వాడకం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహిస్తున్నారు.