అంతరించి పోతున్న చేప జాతిలో సముద్రపు గుర్రం ఒకటి. ఓ వైపు చేప అంటున్నారు. మరో వైపు గుర్రం అంటున్నారు అనుకోకండి.! సముద్రపు గుర్రాలంటే నిజంగా గుర్రాలు కాదు. ఈ తరహ చేపల తల భాగం గుర్రాలను పోలి ఉంటుంది. కాబట్టి వీటిని సముద్రపు గుర్రాలుగా పిలుస్తారు.
ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి..! అందుకే వీటి వేటపై నిషేధం అమల్లో ఉన్నది..! కానీ కొందరు అక్రమంగా చేపలతోపాటు వీటిని కూడా పట్టి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
వీటిని పచ్చివిగా, ఎండబెట్టి కూడా కొందరు అక్రమంగా రవాణా చేస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లాలోని నక్సల్‌బరిలో ఫయాజ్ అహ్మద్ అనే వ్యక్తి.. ఐదు కిలోల ఎండు సముద్ర గుర్రాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. ఘోష్‌పుకూర్ రేంజ్‌లోని కుర్సియాంగ్ ఫారెస్ట్ డివిజన్ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసారు.