ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఎన్నికల తర్వాత కేవలం 24 గంటల్లోనే 10 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీలో చేరాలనుకునే వారికి ఢిల్లీ కార్యాలయం ఒక ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్ కు మిస్డ్ కాల్స్ ఇస్తే ఆన్ లైన్ లో పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 నియోజకవర్గాల్లో 62 స్థానాలకు ఆప్ గెల్చుకుంది. బీజేపీ కేంద్ర మంత్రులు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వందలాది మంది ఎంపీలు ప్రచారంలో పాల్గొన్నా పెద్దగా ఫలితం సాధించలేకపోయింది. బీజేపీ కేవలం 8 స్థానాల్లోనే గెలుపొందింది.