దేశంలో మరో కరోనా మరణం నమోదైంది. ఈ మహమ్మారి కారణంగా ముంబైలో 63 ఏళ్ల వ్యక్తి కన్నుమూశాడు. కరోనా బారిన పడి కొద్దిరోజుల నుంచి ఆస్పత్రిలో ఈయన చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో సదరు వ్యక్తి చనిపోయాడు . ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. దీనితో మహారాష్ట్రలో ఏది రొండో మరణం. కరోనా బారిన పడి భారతదేశం లో ఆరుగురు చెందారు.
మరోవైపు కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు ఈ వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మరో వైపు ప్రధాని మోడీ పిలుపుతో జనతా కర్ఫ్యూ నేపథ్యం లో ప్రశాంత వాతావరణం నెలకొంది.