కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలో 4 కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదు అయింది. దీనితో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. ఇదే విషయమై మంత్రి ఈటెల మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి పై రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు పై వివరించారు. మొదటి కేసు దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి సోకింది. రెండో కేసు ఇటలీ నుంచి వచ్చిన మహిళ కు సోకింది. మూడవ కేసు నెదర్లాండ్ నుంచి వచ్చిన 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత ష్కాట్ ల్యాండ్ నుంచి 45 సంవత్సరాల వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదు అయింది. పాజిటివ్ కేసులు వచ్చిన వ్యక్తులు అందరూ కూడా పొరుగు దేశాలనుంచి వచ్చినవారే అని మంత్రి ఈటెల అన్నారు.
వ్యాధి సోకిన వ్యక్తులకు ఈ మధ్య కాలంలో ఎవరిని కలిశారు, వారు ప్రయాణించిన ఏ విధంగా సాగింది అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నాము. ఎయిర్ పోర్ట్ లో కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేశాము. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తున్నాము. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వేరే ప్రాంతం నుంచి వచ్చారని, అంతే కాకుండా వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేశామని ఎవ్వరికి పాజిటివ్ రాలేదని తెలిపారు.