దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేల ఏపీలో కరోనా సోకిన వ్యక్తి మృతి మృతి చెందటంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 55 సంవత్సరాల వ్యక్తి విజయవాడలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే సదరు వ్యక్తి కొడుకు ఢిల్లీ నుంచి మార్చి 17న విజయవాడకు వచ్చాడు. టెస్ట్ చేసిన తరువాత 31వ తేదీన పాజిటివ్ గా తేలింది. కొడుకు నుంచి తండ్రికి కూడా వచ్చే అవకాశం ఉందని బావించిన అధికారులు తండ్రిని 30 వ తేదీన జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చి సాంపిల్స్ తీసుకోటం, టెస్ట్ చెయ్యటం జరిగింది. కానీ గంట వ్యవధిలోనే సదరు వ్యక్తి చనిపోయాడు. వెంటనే ఈ వ్యక్తికి సంబంధాలు ఉన్న 29 మందిని గుర్తించి క్వరెంటైన్ కు పంపించారు.
చనిపోయిన వ్యక్తి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో కరోనా వైరస్ కారణంగా చనిపోయాడా ఇతర సమస్యల కారణంగా చనిపోయాడా అనేది వైద్యులు పరీక్షించారు. ఆ రిపోర్ట్ రావటానికి కొంత జాప్యం జరిగినప్పటికీ ఇతను కరోనా వైరస్ కారణంగా చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.