తెలుగు అకాడమీ నిధుల గల్లంతు కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. 12వ నిందితుడిగా ఉన్న యోహాన్ రాజు భార్య ప్రమీలారాణి ని పీటి వారెంట్ పై విజయవాడ లో అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే మరోవైపునిధుల రికవరీ పై కూడా దృష్టి పెట్టారు.
ప్రధాన సూత్రధారులు చుండూరు వెంకట సాయి కుమార్, నండూరి వెంకట రమణ కలిసి వైజాగ్ శివార్లలో రియల్ ఎస్టేట్ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసినట్టు గా పోలీసులు గుర్తించారు. నిందితుల డబ్బు చెల్లింపులకు సంబంధించి వివరాలు ఇవ్వాలని రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ని కూడా పోలీసులు కోరారు.