ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్మెంట్ తో ఆవేదనకు గురైన మరో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మరణించారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి డిపోకి చెందిన జమీల్ నిన్న టీవీలో సీఎం ప్రెస్ మీట్ చూస్తుండగా గుండెపోటు వచ్చింది, హుటాహుటిన హాస్పిటల్ కు తరలించినప్పటికె లాభం లేకుండా పోయింది, అప్పటికే మృతి చెంసినట్లుగా డాక్టర్లు తెలిపారు. హుజూర్ నగర్ ఎన్నికల గెలుపు తరువాత మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఇక ఆర్టీసీ నే లేదు అని ప్రకటించడం తో కార్మికులకు మరింత ఆవేదనకు లోనవుతున్నారని యూనియన్ నాయకులు అంటున్నారు. ఇంకా ఎంత మంది చనిపోవాలి అని కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె 21 రోజుకు చేరుకుంది.