ఆర్టీసి సమ్మె పై ప్రభుత్వ నిర్ణయాలతో ఆర్టీసి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మొత్తం 50 వేల మంది కార్మికులను రోడ్డు న పడేసిన ప్రభుత్వం, చర్చలు జరపకుండా చోద్యం చూస్తోంది.ఉద్యోగం పోయిందనే బాధతో కార్మికుల గుండెలు ఆగిపోతున్నాయి.
చెంగిచెర్ల డిపోలో పని చేస్తున్న డి. కొమురయ్య అనే డ్రైవర్ గుండెపోటుతో చనిపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో చెంగిచెర్ల డిపో నుంచి ఉప్పల్ డిపో వరకు జరుగుతున్న ర్యాలీలో కొమురయ్య కు గుండెపోటు వచ్చింది. కిందపడిపోయిన కొమురయ్యను పక్కనే ఉన్న ప్రైవేట్ ఆస్పత్రి కి తరలించిన లాభం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇవ్వాళ ఉదయం హెచ్‌సీయూ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఖలీల్ మియా, నిన్న సంగారెడ్డి పరిధిలో నివసిస్తున్న నాగరాణి అనే ఆర్టీసీ ఉద్యోగిని భర్త కర్నె కిశోర్ కూడా ఈ కారణంగానే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.