ఉద్యోగం ఇక లేదేమో అన్న బెంగతో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగిపోయింది. ప్రభుత్వ ప్రకటన… ఈ రోజు ఉదయం డిపోలకు కార్మికులను అనుమతించకపోవటంతో ఇక తమ ఉద్యోగం పోయినట్లేనన్న బాధతో నిజామాబాద్‌లో ఓ డ్రైవర్ గుండెపోటుతో మరణించారు. బోధన్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేందర్ అనే డ్రైవర్ స్వస్థలం ఎడపల్లి మండలం మంగల్‌పాడ్ గ్రామం.
ఈరోజు ఉదయం గుండెలో నొప్పి వస్తుందని చెప్పగానే ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని… అక్కడే చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారని బంధువులు తెలిపారు.