మరో ఆర్టీసీ కార్మికుడు తుదిశ్వాస విడిచాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన కరీంఖాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు రోజుల క్రితం గుండెపోటు తో ఆసుపత్రి లో చేరిన కరీంఖాన్ ఈ రోజు ప్రాణాలు విడిచాడు. మొన్నటి వరకు సమ్మె లో ఎంతో యాక్టీవ్ గా ఉన్న కరీంఖాన్… కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు హార్ట్ఎటాక్ తెచ్చుకున్నాడు.
తమ న్యాయపరమైన డిమాండ్ లను పరిష్కరించాలని గత 33 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ధిక ఇబ్బందులతో ఇంతమంది కార్మికులు చనిపోతున్న సర్కారుకు మాత్రం చీమ కుట్టినట్టు అనిపించట్లేదు. పైగా ఈ చావులకు ఆర్టీసీ యూనియన్ లీడర్లు ప్రతిపక్షనాయకులే కారణం అంటూ స్టేట్ మెంట్ లు ఇస్తున్నారు.