తెరాస ప్రభుత్వం వైఖరికి మరో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. గత 23 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చేస్తున్న ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోవటంతో మనస్థాపం చెందుతున్న కార్మికులు ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో లో కండెక్టర్ గా చేస్తున్న నీరజ ఆత్మహత్య చేసుకుంది. జీతాలులేక ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువవ్వటం తో ఫ్యాన్ కు ఉరివేసుకుని నీరజ ఆత్మహత్య చేసుకుంది. నిన్నటి వరకు సమ్మె లో నీరజ చురుకుగా పాల్గొందని తోటి కార్మికులు చెప్తున్నారు. పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో ఇంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వంకు చీమ కుట్టినట్టుకూడా లేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు.