ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరత, ప్రభుత్వ తీరుతో భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కి చెందిన కార్మికుడు నాగరాజు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇసుక కొరతతో కొన్ని నెలలుగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ పరిస్థితిని తట్టుకోలేక తాపీ మేస్త్రి నాగరాజు ఉరి వేసుకొని ఆత్మ హత్యకు పాల్పడ్డారు.
కార్మికుల మరణాలపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ప్రభుత్వ హత్యలు అంటూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి.