శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా గౌరీ రొనంకి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందD. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబదించి మాస్ మహారాజా రవితేజ కొత్త సాంగ్ ను విడుదల చేశారు. మధుర నగరిలో అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. మధుర నగరిలో అనే పాటకు శ్రీనిధి, నయన నాయర్, కాల భైరావ గాత్రం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
Advertisements