నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఉప్పెన. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
మరోవైపు తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. తాజాగా జల జల జలపాతం నువ్వు… సెల సెల… సెలయేరు నేను అంటూ కొత్త పాట ను రిలీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ ఈ పాటను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.