టాలీవుడ్ కు సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలు కొత్త కాదు. ఇప్పుడు ఇదే కోవలో మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ వస్తోంది. దీని పేరు సువర్ణ సుందరి. ఎస్ టీమ్ పిక్చర్స్ బ్యానర్ పై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
జయప్రద లాంటి సీనియర్ నటి ఈ సినిమాలో నటించారు. ఆమె పాత్ర టోటల్ సినిమాకే హైలెట్ అని చెబుతోంది యూనిట్. ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందించాడు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు యూనిట్ సభ్యులు.
జయప్రద లాంటి సీనియర్ తో పాటు.. కోట శ్రీనివాసరావు, సాయికుమార్, సత్యప్రకాష్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటించారు.
నిజానికి ఈ సినిమా ఇప్పటిది కాదు. 4 ఏళ్ల కిందటే ఈ సినిమా రెడీ అయింది. అయితే బిజినెస్ పూర్తవ్వకపోవడం, ఆ తర్వాత కరోనా రావడం లాంటి కారణాల వల్ల ఇన్నాళ్లూ లేట్ అవుతూ వస్తోంది. అలా చాలా లేట్ అవుతున్న ఈ సినిమా, ఎట్టకేలకు ఫిబ్రవరిలో థియేటర్లలోకి వస్తోంది.