నారాయణపేటలో మరో సురేష్ - Tolivelugu

నారాయణపేటలో మరో సురేష్

మద్యం మత్తులో దుర్భాషలాడుతూ గ్రామపంచాయతి లో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ ని తగలబెడతా అంటూ ఓ వ్యక్తి హల్ చల్ చేసిన సంఘటన నారాయణపేట జిల్లా లో చోటు చేసుకుంది. నర్వా మండలం, కల్వాల్ గ్రామానికి చెందిన బోయ వెంకటయ్య మద్యం సేవించి పంచాయితి అధికారులపై దుర్భాషలాడసాగాడు. ఎమ్మార్వో విజయారెడ్డి ని చంపినట్టే మిమ్మల్ని కూడా పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ భయబ్రాంతులకు గురిచేశాడు. పంచాయితి కార్యాలయం తలుపు, కిటికీలు మూసేసి తగలబెడతా అంటూ హల్ చల్ చేశాడు.

Share on facebook
Share on twitter
Share on whatsapp