కరోనాకు టీకానే దివ్య ఔషధం అని నిపుణులు చెబుతున్నారు. ప్రాణ నష్టం తగ్గుతుంది.. వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాయి. అయినా కూడా గ్రామీణ స్థాయి ప్రజలు టీకా తీసుకునేందుకు జంకుతున్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపెల్లికి చెందిన ఎల్లయ్య అనే వ్యక్తికి టీకా వేయడానికి వెళ్లారు వైద్య సిబ్బంది. అది మత్తు మందు.. నేను వేసుకోను.. ఊరు విడిచైనా పోతా కానీ టీకా మాత్రం వేసుకోను.. ఏం చేసుకుంటరో చేసుకోరి అని కాసేపు హంగామా చేశాడు. దీంతో వైద్యాధికారులు అతనికి వ్యాక్సిన్ వేయకుండానే వెనుదిరగక తప్పలేదు.