లూడో గేమ్ కారణంగా ఓ నిండు ప్రాణం బలయింది. పాతబస్తీ గుఫ్ఫా నగర్ లో ఇద్దరు యువకుల మధ్య మొదలైన వాగ్వాదం.. ఘర్షణకు దారితీసింది. హనీఫ్, హాజీ అనే ఇద్దరు యువకులు లూడో గేమ్ పందెం వేసుకున్నారు. కానీ.. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఈ దాడిలో హనీఫ్ అక్కడికక్కడే మృతిచెందగా హాజీ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.