రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి లేదా ఒక సమూహం ఆలోచనలు ఓ దేశాన్ని నిర్మించడం గానీ విచ్చిన్నం చేయడం గానీ చేయలేవని ఆయన పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ…
“మంచి దేశాలు” అనేక బహుళ ఆలోచనలను కలిగి ఉంటాయని చెప్పారు. అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల వ్యవస్థలు ఉండటంతోనే అవి అభివృద్ధి చెందుతాయన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చెబుతున్న వన్ నేషన్- వన్ ఎలక్షన్ విధానాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు.
ప్రతి నెలా దేశంలో ఏదో ఓ చోటా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో అభివృద్ది పనులపై, పాలనపై ప్రభావం పడుతుతోందని ప్రధాన మంత్రి గతంలో అన్నారు. అందువల్ల జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని మోడీ వ్యాఖ్యానించారు. తాజాగా దీనికి భిన్నంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చేశారు.
ఇది ఇలా వుంటే నాగ్‌పూర్ రాజకుటుంబం భోంస్లే కుటుంబం గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతూ… సంఘ్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ కాలం నుంచి ఆ కుటుంబానికి ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉందన్నారు. నాగపూర్ భోంస్లే కుటుంబ పాలనలో తూర్పు, ఉత్తర భారతదేశాలు దురాగతాల నుంచి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.