కే జి ఎఫ్ సినిమా తో స్టార్ దర్శకుడిగా మారిపోయాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రామగుండం ఇటీవల జరిగింది. అయితే ఆ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు మరో ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుల్లెట్ పై ప్రభాస్ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. బొగ్గుగని కార్మికుల నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు అక్కడ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.