మామూలుగా సినిమాలలో ఫోటో వల్ల లేదా ఓ మెసేజ్ వల్ల పెళ్లిళ్లు ఆగిపోతూ వుంటాయి. కానీ ఓ ఫోటో కారణంగా నిజజీవితంలో కూడా పెళ్లిళ్లు ఆగిపోతాయా అంటే అవుననే చెప్పాలి. అసలు విషయం ఏంటంటే తన ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి జరిపిస్తున్నారని తెలుసుకున్న ప్రియుడు పెళ్లి కొడుకు ఫోటో పంపించాడు. అంతే అక్కడితో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
అనపర్తి మండలానికి చెందిన ఓ యువతి యువకుడు ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లికి అమ్మాయి తరుపున వాళ్ళు ఒప్పుకోలేదు. అంతే కాదు మరో సంబంధం చూసి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న యువకుడు పెళ్లి దగ్గర పడుతుండడంతో పెళ్ళికొడుకు ఫోన్ నెంబర్ కనుక్కున్నాడు ఓ వాట్సాప్ మెసేజ్ కొట్టాడు. యువతితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. వెంటనే ఆ పెళ్లి కొడుకు తనకి పెళ్లి వద్దు అంటూ యువతి బంధువులకు చెప్పాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ కారణంగానే పెళ్లి ఆగిపోయిందని యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.