ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 21 కొత్త కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 132కు చేరుకుంది. ఏపీలో ప్రతి రోజు పెద్ద మొత్తంలో కరోనా కేసులు నిర్ధారణ అవుతుండడం ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో పాల్గొని వచ్చిన వారే కరోనా బాధితుల్లో అధికంగా ఉన్నారు. అక్కడ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారందరినీ పరీక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీలో ఇంకా వందలాది మంది కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. అత్యధికంగా గుంటూరులో 20, నెల్లూరులోనూ 20 కేసులు నమోదయ్యాయి. కృష్ణా లో 15,ప్రకాశం లో 17, కడప లో 15, చిత్తూరు లో 8, విశాఖలో 11,అనంతపురంలో 2, నెల్లూరులో 20,కర్నూల్ లో 1, పగో లో 14 కేసులు నమోదు అయ్యాయి.