అన్నీ పోగొట్టుకున్న అంబానీ ! - Tolivelugu

అన్నీ పోగొట్టుకున్న అంబానీ !

అంబానీ అనగానే ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒకరిగా గుర్తుకు వస్తారు. గతంలో గుండు సూది నుండి ప్రతి రంగంలోనూ టాటాలు ఉంటారన్న మాటలు గుర్తుకు తెస్తూ… ఇప్పుడు అంబానీలు ఎదుగుతూ వస్తున్నారు. వేల కోట్ల అధిపతి కాస్త… ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి దిగజారిపోయాడు. అయితే… ఇక్కడ మాట్లాడేది ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ గురించి.

ఒకప్పుడు ముఖేష్‌కు పోటీగా ఉన్న అనిల్ అంబానీ… ముఖేష్ ఆస్తులు ఎలా పెరుగుతూ వచ్చాయో… అనిల్ అప్పులు కూడా అలాగే పెరిగిపోయాయి. ఎంతలా అంటే ముఖేష్ ఆదుకోకపోతే ఇప్పటికే జైలుకు వెళ్లేలా అనిల్ అంబానీ పరిస్థితి దిగజారిపోయింది. తాజా చైనా బ్యాంకులకు భారీగా అప్పున్న అనిల్‌ అంబానీ తన ఆస్తులకు, అప్పులకు లెక్క సరిపోతుందని… ఇక తన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని చైనా బ్యాంకుల కేసులో కోర్టుకు సమాధానం ఇవ్వటం గమనార్హం.

నా పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోయాయి. నా ఆస్తులన్నీ కలిపితే 82.4 మిలియన్ డాలర్లు… నేను కట్టాల్సిన అప్పులు కూడా దాదాపు అంతే. ఇక నా దగ్గర మిగిలేది ఏమీ లేదు అని ప్రకటించారు. 2012లో చైనాకు సంబంధించిన మూడు బ్యాంకులు దాదాపు 4900కోట్ల అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp