న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కీలక పాత్రలో నటించారు. అయితే అలాగే నివేద థామస్, అతిథి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. 2020 సెప్టెంబర్ 5న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటి టి లో రిలీజ్ అయింది. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి కీలక పాత్రలో నటించారు.
నాని కెరీర్ లో 25వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సౌండ్‌ట్రాక్ స్వరపరిచగా, థమన్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుకు సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్టర్ పోస్ట్ చేసింది.