యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరుకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాకు ముందు ఒక లెక్క బాహుబలి సినిమా తరువాత మరో లెక్క. ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ తీస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సాహో. బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా కలెక్షన్ల పరంగా మాత్రం మంచి రికార్డును సొంతం చేసుకుంది సాహో.
ఇక బాలీవుడ్ లో ఈ సినిమా ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. నేటికి సాహో సినిమా ఏడాది పూర్తి చేసుకోవడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తరువాత నాగ్ అశ్విన్ సినిమా తో పాటు ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్ .