ఏడాదిన్నర ఆవుదూడు అద్భుతం చేస్తుంది. బిడ్డనుకనకుండా బ్రహ్మాండగా పాలిస్తుంది. ఏంటీ విడ్డూరం అనుకుంటున్నారా !? విడ్డూరమే మరి ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ లోని ఆవుదూడను చూస్తే మీరు కూడాముక్కున వేలేసుకుంటారు. ఖోరాబర్లోని జార్వా నివాసి గిరినిషాద్ 15 రోజుల క్రితం ఓ ఆవుదూడను ఇంటికి తీసుకువచ్చాడు.వారం రోజులు గడిచిన తర్వాత నుండి అది పాలివ్వడం మొదలెట్టింది. తొలుత తక్కువ పాలిచ్చే దూడ, క్రమంగా నాలుగు లీటర్ల పాలివ్వడం దాకా వచ్చిందని యజమాని గిరి చెప్పుకొచ్చారు. దూడను నందిగా భావించి కుటుంబ సభ్యలు పూజిస్తున్నారు.
ఈనకుండానే ఆవుదూడ పాలివ్వటం అద్భుతమని స్థానికులు చెబుతున్నారు. ఈ వింత దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దెత్తున తరలివస్తున్నారు. నమ్మకం కుదరని వాళ్ళు తామే పాలు తీసి అబ్బురపడుతున్నారు.యజమానులే కాకుండా మిగతావాళ్ళు పాలు పితకినా..దూడ సహకరించడం విశేషం.
అయితే గర్భందాల్చకుండా పాలివ్వడం హార్మోన్ల ప్రభావమని, దూడలో ఇంతకు ముందు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తిఉండవచ్చిని చికిత్సకోసం వాడిన మందుల వల్ల కూడా దూడలో ఈ మార్పులు తీసుకొచ్చేఅవకాశం ఉండవచ్చని పశువైద్యుడు యోగేష్ సింఘ్ అభిప్రాయడ్డారు. పాలు తాగితే భవిష్యత్తులో ఏవైనా దుష్ఫలితాలు వస్తాయానే విషయంపై నిపుణుల సలహాతీసుకోవడం అవసరమని వైద్యుడు యోగేష్ చెప్పారు.