ఏపీ నుండి ఓఎన్జీసీ వెళ్లిబోతుందా…? ఫలితంగా 40వేల కోట్ల ప్రాజెక్ట్ తరలిపోనుందా…? సీఎం జగన్ వైఖరిపై ఓఎన్జీసీ అధికారులు మనస్తాపంతో ఉన్నారా…? అంటే అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు.
గతంలో చేసుకున్న అగ్రీమెంట్ ప్రకరాం ఓఎన్జీసీ అధికారులు పనులు చేయటం లేదన్న కారణంతో… ఏపీఐఐసీ 20కోట్ల ఫైన్ విధించింది. ఆ తర్వాత ఏపీ సీఎం జగన్‌ను కలిసి, తమ ఇబ్బందులను వివరించటంతో పాటు ఫైన్‌ను తగ్గించాలని కోరాలనుకున్న ఓఎన్జీసీ అధికారులకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కూడా దొరకటం లేదట. ఓవైపు వైసీపీ ప్రభుత్వం వేధింపులు, మరోవైపు పరిష్కారం కానీ ఇబ్బందులతో ఏపీ నుండి వెళ్లిపోయే ఆలోచనలతో ఉందట ఓఏన్జీసీ యాజమాన్యం.
దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ కూడా స్పందిస్తూ… ప్రైవేటు సంస్థలే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలైన కార్పోరేషన్లు కూడా ఏపీ నుండి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. అయితే, గోదావరి జిల్లాల్లో ఆయిల్ వెలికితీస్తోన్న ఓఎన్జీసీ కంపెనీ… రాష్ట్రానికి వాటా ఇవ్వకపోవటంపై సీఎం జగన్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా సాగుతున్న నేపథ్యంలో… ఏపీ నుండి ఓఎన్జీసీ వెళ్లిపోవటం లాంఛనమే కానుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.