ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నారాయణపేట జిల్లా కోస్గి లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలపై ఎక్కడికక్కడే అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు దాడులు చేశారు.
పోలీసులు సైతం టీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ గొడవల్లో ఓ కానిస్టేబుల్ తలకు గాయాలు కూడా అయ్యాయి. పోలీసు వాహనాలు, సెల్ ఫోన్లు ధ్వంసమయ్యాయి.
ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. కనబడిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ చావబాదారు. అయితే ఇదంతా కూడా స్థానిక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగటం గమనార్హం.
ఇక శుక్రవారం కూడా పరిస్థితి అలానే కొనసాగుతుంది. ఎక్కడికక్కడే కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు అరెస్టులు జరుగుతున్నాయి. కొడంగల్ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.