తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఉల్లి ధరలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి బుధవారం మధ్యాహ్నానికి గరిష్ఠంగా క్వింటాలు ఉల్లి ధర రికార్డు స్థాయిలో రూ।12వేల 510కి చేరుకుంది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులకు రాయితీపై ఉల్లి అందించేందుకు రాష్ట్రప్రభుత్వాలు రైతుబజార్లను ఏర్పాటు చేసినా ఉల్లి సరఫరా కేంద్రాల్లో సైతం ఉల్లి నిల్వలు లేక వెలవెలబోతున్నాయి. దీంతో ఉల్లి కొనేందుకు వచ్చిన వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరో వైపు ఉన్న ఉల్లిని కొనుక్కోటానికి వెళ్లినవారికి ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర కొన్ని చోట్ల 15o రూపాయలు వరకు పలుకుతుంది.