పేద, మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడనుంది. ఇప్పటికే ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటుతుండగా..మరి కొద్ది రోజుల్లో కోడిగుడ్ల ధరలు కూడా పెరగనున్నాయి. పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడం, లేయర్ ఫౌల్ట్రీ ఫామ్స్ కు లాభాలు లేకపోవడంతో కోడిగుడ్ల ధరలు పెంచడమే ఏకైక మార్గంగా పౌల్ట్రీ ఫామ్స్ యజమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం 5,6 రూపాయలున్న కోడిగుడ్డు ధర రూ.10 కు పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
మొక్కజొన్న,సోయా గింజలను ఫౌల్ట్రీ ఫీడ్ కోసం వాడుతుంటారు. వర్షాకాలంలో మొక్క జొన్న పంట దెబ్బతినడంతో ఫౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఒక్కో కోడిగుడ్డుకు ఉత్పత్తి కంటే ఒకటి,రెండు రూపాయలు నష్టపోతున్నట్టు ఫౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు.