ఆన్ లైన్ లో గేమింగ్, బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద అకౌంట్లో ఉన్న రూ.24 కోట్లను సీజ్ చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.. హైదరాబాద్ పీర్జాదిగూడలో బెట్టింగ్ శిబిరంపై దాడులు చేశారు.
బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థలం పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డికి చెందిన స్థిరాస్తి వ్యాపార కార్యాలయంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనా స్థలంలో పీర్జాదిగూడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, ఓ కార్పొరేటర్, ఆరుగురు కార్పొరేటర్ల భర్తలు, కొందరు బిల్డర్లు ఉన్నట్లు తెలిసింది.
ఎస్ ఓటీ దాడుల సమాచారం బయటకు పొక్కడంతో మేడిపల్లి పోలీసులు, స్థానిక నేతల అనుచరులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. సోదాలు చేసిన కార్యాలయంలోకి పోలీసులు మీడియాను అనుమతించలేదు.
ప్రజా ప్రతినిధులను లోపలే ఉంచి కరెంట్ ఆఫ్ చేశారు ఆపేశారు. ఇంతలోనే నేతల అనుచరులు మీడియా ప్రతినిధులపై దాడి చేసి సెల్ ఫోన్లు లాక్కున్నారు. మీడియా ప్రతినిధులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.