ఇప్పటికే పలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో అక్టోబరు నుంచి ఆన్‌లైన్ తరగతులు జరుగుతుండగా… తాజాగా డిసెంబరు 5న ప్రత్యేక దోస్త్ సీట్లను కేటాయించిన నేపథ్యంలో అధికారికంగా 7 నుంచి ఆన్‌లైన్ తరగతులు జరుపుతామని దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆర్.లింబాద్రి వెల్లడించారు. తాజాగా సీట్లు పొందిన వారందరూ ప్రవేశాలు పొందితే దోస్త్ ద్వారా డిగ్రీలో చేరిన వారి సంఖ్య 2.17 లక్షలు దాటుతుంది. గతేడాది చేరిన విద్యార్థుల సంఖ్య 1.80 లక్షలు మాత్రమే కావటం గమనార్హం.
ఎంసెట్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రత్యేక విడత దోస్త్ ద్వారా కొత్తగా 27,365 మందికి డిగ్రీ కాలేజీల్లో సీట్లు లభించాయి. సీట్లు పొందినవారు డిసెంబరు 8వ తేదీలోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.