ఏం బుక్ చేయకుండా ఆర్డర్ ఇంటికొచ్చిందా !? ఓటీపీ చెప్పండి అంటూ డెలివరీ బాయ్ మిమ్మల్ని అడిగాడా.? ఇదేంట్రా అనుకునేలోపు…డెలివరీ బాయ్ మీ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మొబైల్‌కు ఓటీపీ చెప్పండి చాలు అని నమ్మబలికి అకౌంట్ మొత్తం ఖాళీ చేసెస్తారు. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు సైబర్ నిపుణులు.
ఆన్‌లైన్ మోసాలలో ఇదో కొత్తట్రెండ్ ఎక్కువైపోతున్నాయని ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఓఎల్‌ఎక్స్ లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలను మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఆ కోవలోనే ఇటీవల మీషో, క్వికర్ వినియోగదారులను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వకుండా మనకు ఎలాంటి వస్తువు ఇంటికి రాదని.. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే అస్సలు చెప్పొద్దని అంటున్నారు. ఒకవేళ మోసం జరుగుతున్నట్లు అనుమానమొస్తే.. వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు.
ఇలాంటి మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే.. 9121211100 వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏపీ సైబర్ క్రైమ్ ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు.