అసాంఘిక కార్యకలాపాల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. డేటింగ్ యాప్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. అమ్మాయిలకు ఉద్యోగాల పేరిట ఈ ముఠా గాలం వేస్తోంది.
నిరుద్యోగ అమ్మాయిలకు ఉద్యోగం ఆశ చూపి రూ. 60వేల జీతం అంటూ వారిని వ్యభిచార కూపంలోకి దింపుతోంది. గౌలి దొడ్డిలోని కన్ క్లేవ్ హోటల్‌లో పోలీసులు దాడులు చేశారు. హోటల్‌లో ఓ జంటను పోలీసులకు పట్టుకున్నారు. వారిని విచరించగా అసలు విషయం బయట పడింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో పని చేసే హనీ ద్వారా ప్రిన్స్ అనే వ్యక్తి హ్యాప్సిన్ యాప్‌లో అమ్మాయిల ఫోటోలు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. నెలకు రూ. 60 వేల అని చెప్పి వారిని గచ్చిబౌలిలోని హూ అపార్ట్ మెంట్‌లో ఉంచి అక్కడ వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
నెలకు రూ. 60 వేల జీతం అని చెబుతుండటంతో పేద యువతులు ఈ ముఠా వలలో పడుతున్నారు. చివరికి వ్యభిచార కూపంలోకి దిగాల్సిన పరిస్థితి వస్తోంది. పేదరికంతో కష్టలు పడుతూ ఉద్యోగాల కోసం వెతుకుతున్న అమ్మాయిలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటోంది. వారిని ట్రాప్ చేస్తోంది.